Bigg Boss 6 Telugu | ఎవరికి వాళ్లు బిగ్ బాస్ కప్పు కొడతాం అంటున్నారు.. కొట్టేదెవరో..?
Bigg Boss 6 Telugu | నిజం చెప్పాలంటే బిగ్ బాస్ 6 తెలుగు మొదలై 4 వారాలు అయిపోతున్న కూడా.. రేటింగ్స్ విషయంలో స్టార్ మా యాజమాన్యం అంత సంతృప్తిగా లేదు.
Bigg Boss 6 Telugu | నిజం చెప్పాలంటే బిగ్ బాస్ 6 తెలుగు మొదలై 4 వారాలు అయిపోతున్న కూడా.. రేటింగ్స్ విషయంలో స్టార్ మా యాజమాన్యం అంత సంతృప్తిగా లేదు. ఎందుకంటే గత సీజన్స్‌తో పోలిస్తే ఈసారి చాలా తక్కువ రేటింగ్స్ వస్తున్నాయని వాళ్లు సీరియస్‌గా ఉన్నారు. అందుకే నాగార్జున కూడా శనివారం వచ్చినప్పుడు కంటెంట్ ఇవ్వాలంటూ కంటెస్టెంట్స్‌ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నాడు. మీరు ఇలా ఆడితే ఎలా అంటూ ఎప్పటికప్పుడు క్లాసులు పీకుతూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇంట్లో కొంతమంది కంటెస్టెంట్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తుంటే వామ్మో అనిపించక మానదు. ఎవరికి వాళ్లు ఈసారి టైటిల్ మాదే అంటూ బల్లగుద్ది చెబుతున్నారు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే అసలుకే మోసం వస్తుంది అంటూ సోషల్ మీడియాలో వీళ్లపై గట్టిగా సెటైర్లు కూడా పడుతున్నాయి.
సింగర్ రేవంత్ అయితే ఈసారి టైటిల్ నాదే.. మీరందరూ పక్కకు జరగండి అనే రేంజ్లో ఉన్నాడు. కప్పు కొడతానని ఈయన చెప్పిన ధైర్యం చూస్తుంటే.. ఎవరు ఎంత యాక్ట్ చేసిన ప్రైజ్ మనీ మాత్రం నాదే అని దూకుడు సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ గుర్తుకొస్తుంది అంటున్నారు నెటిజన్లు. ఈయన ఆట తీరు బాగానే ఉన్నా.. మాట తీరు మాత్రం తేడాగా ఉంది. ఇదే ఎప్పుడోసారి రేవంత్ కొంపముంచేలా కనిపిస్తుంది. మరోవైపు గీతూ కూడా ఈసారి కప్పు నాదే అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్తుంది. తాజాగా ఈ లిస్టులోకి ఇనాయా సుల్తానా వచ్చి చేరింది. ఆట కంటే నోరు వేసుకొని పడిపోయే ఈ ముద్దుగుమ్మ.. తాజా నామినేషన్స్‌లో భాగంగా మంగమ్మ శపథం చేసింది. ఈసారి కప్పు కొట్టి టైటిల్ గెలిచి అందరికీ నేనేంటో చూపిస్తాను అంటూ సవాలు చేసింది. మొత్తానికి ఈసారి కంటెస్టెంట్స్ లో ఫైర్ బాగానే ఉంది కానీ ఆటలో మాత్రం అది కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరి వీళ్లలో నిజంగా కప్పు కొట్టేది ఎవరు? ఖాళీ చేతులతో వచ్చేది ఎవరు అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు.
Read More :
బిగ్‌బాస్ ఐదో వారం నామినేషన్స్‌లో 8 మంది.. డేంజర్ జోన్లో ఆ నలుగురు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

