Mohini Dey | భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన ఏఆర్ రెహమాన్ ట్రూప్ బాసిస్ట్ మోహిని..!
Mohini Dey | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. అదే సమయంలో ఏఆర్ రెహమాన్ టీమ్‌లోని బాసిస్ట్ మోహిని దే సైతం భర్త మార్క్‌తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Mohini Dey | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. అదే సమయంలో ఏఆర్ రెహమాన్ టీమ్‌లోని బాసిస్ట్ మోహిని దే సైతం భర్త మార్క్‌తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఏఆర్ రెహబాన్ దంపతులు విడిపోతున్నట్లుగా ప్రకటించిన కొద్దిగంటల్లోనే.. మోహిని సైతం డివోర్స్‌పై ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మోహిని, మార్క్ సంయుక్త ప్రకటనలో పరస్పర అవగాహన ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. అయినా ఇద్దరం మంచి స్నేహితులుగా ఉంటామని.. జీవితంలో భిన్నమైన విషయాలను కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
ముందుకు సాగేందుకు పరస్పర అంగీకారంతో విడిపోవడమే ఉత్తమమైన మార్గమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మోహిని కోల్‌కతా నివాసి కాగా.. ఆమె బాస్ ప్లేయర్. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా షోల్లో ఏఆర్ రెహమాన్‌తో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. ఇక ఏఆర్ రెహమాన్ 1995లో సైరా భానును వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలకు పెళ్లయ్యింది. వైవాహిక బంధంలో ఏర్పడిన భావోద్వేగ క్షణం తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఏఆర్ రెహమాన్ న్యాయవాది తెలిపారు. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నా.. ఉద్రిక్తలు, ఆందోళనలు వారి మధ్య గ్యాప్‌ను పెంచాయని.. ఆ అగాధాన్ని పూడ్చేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

