Hit-2 Movie | ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్.. డేంజర్ బెల్స్ మోగిస్తున్న అడివి శేష్..!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అడివి శేష్ ప్రతీ సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు . ఈయన సినిమా వచ్చిందంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు.
Hit-2 Movie Break even Completed | టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అడివి శేష్ ప్రతీ సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు . ఈయన సినిమా వచ్చిందంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు. అంత ఖచ్చితంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు శేష్. తాజాగా ఈయన నటించిన హిట్ 2 కూడా అద్భుతమైన విజయం సాధించింది. డాక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాకు నాచురల్ స్టార్ నాని నిర్మాత. భారీ అంచనాల మధ్య విడుదలైన హిట్ 2 అంచనాలు అందుకోవడమే కాకుండా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఇవ్వని అయిపోయింది.
మర్డర్ మిస్టరీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన అడివి శేష్.. తాజాగా మరోసారి తన పట్టు చూపించాడు. ఈ సినిమా మూడు రోజుల్లోనే నైజాంలో 5 కోట్ల 10 లక్షల షేర్ వసూలు చేసింది. సీడెడ్ లో కోటి 15 లక్షలు.. ఉత్తరాంధ్రలో కోటి 41 లక్షలు.. ఈస్ట్ వెస్ట్ లో కలిపి కోటి 10 లక్షలు.. గుంటూరులో 68 లక్షలు.. కృష్ణ, నెల్లూరులో కలిపి మరో 1 రూపాయల షేర్ వసూలు చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 10.5 కోట్ల షేర్ వసూలు చేసింది హిట్ సీక్వెల్.
అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి 20 లక్షలు.. ఓవర్సీస్ లో 3 కోట్ల 20 లక్షలు వసూలు చేసి.. ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల షేర్ సొంతం చేసుకుని హిట్ 2. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఇవ్వాలంటే మరో 9 లక్షలు వసూలు చేస్తే చాలు. సోమవారం కూడా వసూలు స్ట్రాంగ్ గా ఉండడంతో 20 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా నైజాం ప్లస్ ఓవర్సీస్ లో అడవి శేష్ సినిమాలకు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే శేష్ మార్కెట్ మరింత పెరగడం ఖాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

