క్లాసిక్ మూవీ ‘ఆదిత్య 369’కి 30 ఏళ్లు

గ్రాఫిక్స్ లేని రోజుల్లో ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్‌ని అందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369.తొలి ఇండియన్ సైప్స్ ఫిక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మూల కారణం దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం అని చెప్పుకొచ్చారు హీరో బాలకృష్ణ ,దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ,నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.
ఓ సందర్భంలో సింగీతం తన మనసులో ఉన్న ట్రైమ్ ట్రావెల్ లైన్ గురించి బాలుకి చెప్పారు. ఎస్పీబీ ఎగ్జయిట్ అయి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ని సింగీతంని కలవమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ఎస్పీబీ కారణం అయ్యారు. ‘ఆదిత్య 369’ ప్రత్యేకత ఏంటంటే… ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది. ‘ఆదిత్య 369’చిత్రాన్ని ఈ రోజులకు కూడా అన్వయించుకునేలా ఉంటుంది.
‘ఆదిత్య 369’ చేసేటప్పుడు చాలామంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారని అన్నారు బాలకృష్ణ. ఈ సినిమాకు గుండెకాయ శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర. ఈ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. గ్రాఫిక్స్ లేని రోజుల్లో మొట్టమొదటిసారి వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి… సినిమా నెగటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. భారతీయులు ఇటువంటి సినిమా చేయగలరని నిరూపించాం. ముందు ముందు ‘ఆదిత్య 369’కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు బాలకృష్ణ. ఆదిత్య 369 చిత్రం 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ వీడియో విడుదల చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

