ఆదిసాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బ్లాక్’. జి.బి.కృష్ణ దర్శకుడు. మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను సాయికుమార్ విడుదల చేశారు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆది క్యారెక్టర్ కొత్త పంథాలో ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించే కథ, కథనాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.
ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుంది’ అన్నారు. ‘నటుడిగా నన్ను కొత్త కోణంలో చూస్తారు. ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచే చిత్రమిది’ అని హీరో ఆది సాయికుకుమార్ తెలిపారు. వినూత్న కథతో రూపొందించిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని నిర్మాత మఃహంకాళి దివాకర్ అన్నారు.