మహిమాన్వితం రామచరితం
భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్'. ప్రభాస్ టైటిల్ రోల్‌ని పోషిస్తుండగా, సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఇది నా రాముడి గాథ. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహానీయుడు.
భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ టైటిల్ రోల్‌ని పోషిస్తుండగా, సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఇది నా రాముడి గాథ. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహానీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది రఘునందనుడి గాథ’ అంటూ రామదూత హనుమంతుడి మాటలతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది.
అనంతరం సీతాపహరణం, వానరసేనతో శ్రీరాముడు లంకపై యుద్ధానికి బయలుదేరడం, రామరావణ యుద్ధం వంటి ఘట్టాలతో ట్రైలర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. సీత నాకు ప్రాణమే అయినా..ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అంటూ రాఘవుడి పాత్రలో ప్రభాస్ పలికిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆధునిక సాంకేతిక హంగులతో విజువల్ ఫీస్ట్‌లా ట్రైలర్‌ను రూపొందించారు. బాలీవుడ్ నటుడు సైఫ్అలీఖాన్ ప్రతినాయకుడు లంకేష్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్‌చౌహాన్ ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ పల్నాని, సంగీతం: అజయ్-అతుల్, నిర్మాతలు: టీ సిరీస్ భూషణ్ కుమార్, యూవీ క్రియేషన్స్, దర్శకత్వం: ఓంరౌత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

