విద్రోహులపై పోరాటం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లాక్'. జి. బి.కృష్ణ దర్శకుడు. మహంకాళి దివాకర్ నిర్మాత. ఏప్రిల్ 22న విడుదలకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పోలీస్ కథాంశమిది
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లాక్’. జి. బి.కృష్ణ దర్శకుడు. మహంకాళి దివాకర్ నిర్మాత. ఏప్రిల్ 22న విడుదలకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పోలీస్ కథాంశమిది. ఆది పాత్రలో భిన్న కోణాలుంటాయి. యాక్షన్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. సంఘ విద్రోహులపై పోలీస్ పోరు ఆసక్తిని పంచుతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది’ అని చెప్పారు. ‘కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఆది నటన ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. ఏప్రిల్ మొదటివారంలో ట్రైలర్‌ను విడుదల చేస్తాం’ అని నిర్మాత తెలిపారు. దర్శనబానిక్, కౌషల్ మందా, ఆమని, పృథ్విరాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: సురేష్ బొబ్బిలి, రచన-దర్శకత్వం: జి.బి.కృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- action
- Adi Saikumar
- April
- black
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

