విఫల ప్రేమ జ్ఞాపకాలు
తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే తన సీనియర్ అయిన ఓ అబ్బాయి ప్రేమలో పడ్డానని, అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదని చెప్పింది పంజాబీ భామ తాప్సీ. కెరీర్ ఆరంభంలో తెలుగులో గ్లామర్ నాయికగా పేరు తెచ్చుకున్న ఈ భామ అనంతరం హిందీ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే తన సీనియర్ అయిన ఓ అబ్బాయి ప్రేమలో పడ్డానని, అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదని చెప్పింది పంజాబీ భామ తాప్సీ. కెరీర్ ఆరంభంలో తెలుగులో గ్లామర్ నాయికగా పేరు తెచ్చుకున్న ఈ భామ అనంతరం హిందీ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ మహిళా ప్రధాన ఇతివృత్తాలను ఎంచుకొని ప్రతిభను నిరూపించుకుంది.
వైవిధ్యమైన కథలకు చిరునామా తాప్సీ అనే పేరును సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన ‘డంకీ’ చిత్రంలో షారుఖ్‌ఖాన్‌తో జోడీగా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నది తాప్సీ. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పాఠశాల ప్రేమాయాణం గురించి చెప్పుకొచ్చింది. ‘ఆ ఆబ్బాయి నా సీనియర్. నాతో చనువుగా ఉండేవాడు. ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా మాట్లాడటం మానేశాడు. ప్రేమ వ్యవహారం వల్ల తాను చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నానని బాధ పడేవాడు. అలా నా నుంచి క్రమంగా దూరమయ్యాడు. విడిపోయే ముందు నేను బాగా చదువుకొని లైఫ్‌లో సక్సెస్ కావాలని ఓ సలహా కూడా ఇచ్చాడు. అయితే నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియని ప్రాయం కాబట్టి ఆ విఫల ప్రేమ జ్ఞాపకాలు కొన్ని రోజులు బాధించాయి’ అని చెప్పింది తాప్సీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

