Actress Sreeleela | బెంగళూరులో హాస్పిటల్ పెట్టె ఆలోచనలో శ్రీలీల.?
Actress Sreeleela | పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గత ఏడాది ‘ధమాకా’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఈ ఏడాది భగవంత్ కేసరి, స్కంద, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలతో సందడి చేసింది. వచ్చే ఏడాది కూడా గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలతో ఇదే హవా కొనసాగించనుంది శ్రీలీల.
Actress Sreeleela | పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గత ఏడాది ‘ధమాకా’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఈ ఏడాది భగవంత్ కేసరి, స్కంద, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలతో సందడి చేసింది. వచ్చే ఏడాది కూడా గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలతో ఇదే హవా కొనసాగించనుంది శ్రీలీల. అయితే సినిమాలపై ఆమెకు ఎంత ఆసక్తిగా ఉందో? చదువు అన్నా అంతే ఆసక్తి. అందుకే డాక్టర్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మడు డాక్టర్ కావాలనుకుంది. ఈ నేపథ్యంలో చదువును ఎక్కడా అశ్రద్ధ చేయలేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ పూర్తిచేసే పనిలో ఉంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చివరి ఏడాది పరీక్షలు రాస్తోంది. ఈ నెల 18 నుంచి 24 వరకూ ముంబయిలో ఎంబీబీఎస్ పరీక్షలు కావడంతో, షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి ముంబయి చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైతే యాక్ట్రస్ శ్రీలీల కాస్తా డాక్టర్ శ్రీలీలగా మారుతుందన్నమాట.
అయితే ఈ ఫైనల్ ఇయర్ పరీక్షలు ముగిసిన అనంతరం శ్రీలీల తన తల్లితో కలిసి బెంగుళూరులో ఒక ఆసుపత్రి ప్రారంభించే ఆలోచనలో ఉందట. అయితే అంతకు ముందే హయ్యర్ స్టడీస్‌కు వెళ్లాలా? లేక సినిమాలు కొనసాగిస్తూ ఆసుపత్రి బాధ్యతలు నిర్వర్తించాలా? అన్నది శ్రీలీల ఇంకా ఆలోచించుకోలేదని సమాచారం. ఇక హయ్యర్ స్టడీస్ అంటే మాత్రం ఈ స్థాయిలో సినిమాలు చేయడం కుదిరేపనైతే కాదు. మరి కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

