Sonia Agarwal | ఆయనతో చేయడానికి ఏ సమస్య లేదు.. మాజీ భర్తపై 7/జీ బృందావన్ కాలనీ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sonia Agarwal | సోనియా అగర్వాల్ గురించి తెలియని వాళ్లు పెద్దగా ఉండకపోవచ్చు. 2004లో వచ్చిన 7/జీ బృందావన్ కాలనీ సినిమాతో ఈమె సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తనకు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ సెల్వ రాఘవన్‌నే పెండ్లి చేసుకోవడం.. కొన్నాళ్లకే విడాకులు ఇవ్వడంతోనూ అప్పట్లో సెన్సేషన్‌గా మారింది.
Sonia Agarwal | సోనియా అగర్వాల్ గురించి తెలియని వాళ్లు పెద్దగా ఉండకపోవచ్చు. 2004లో వచ్చిన 7/జీ బృందావన్ కాలనీ సినిమాతో ఈమె సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తనకు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ సెల్వ రాఘవన్‌నే పెండ్లి చేసుకోవడం.. కొన్నాళ్లకే విడాకులు ఇవ్వడంతోనూ అప్పట్లో సెన్సేషన్‌గా మారింది. విడాకుల తర్వాత మరో పెండ్లి చేసుకోకుండా సినిమాలకే పరిమితమైన సోనియా అగర్వాల్ ఇప్పుడు తన మాజీ భర్తతో కలిసి పనిచేయడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
నీ ప్రేమకై సినిమాతో హీరోయిన్గా మారిన సోనియా అగర్వాల్.. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన కాదల్ కొండైన్ సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగులో నేను టైటిల్‌తో రీమేక్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో 7జీ బృందావన్ కాలనీ, పుదుపెట్టై (ధూల్‌పేట ) చిత్రాలు తెరకెక్కాయి. వీటిలో 7జీ బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. దీంతో పాటు పుదుపెట్టై చిత్రానికి కూడా సీక్వెల్ చేస్తానని సెల్వరాఘవన్ రీసెంట్గా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో పుదుపెట్టై-2లో నటిస్తారా? అనే దానిపై సోనియా అగర్వాల్‌కు తాజాగా ఓ ప్రశ్న ఎదురైంది.
ఈ ప్రశ్నకు స్పందించిన సోనియా అగర్వాల్.. తన మాజీ భర్త సెల్వరాఘవన్‌తో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది. యాక్టింగ్ తన వృత్తి అని, పుదుపెట్టే-2లో నటించడం తనకు ఇష్టమేనని తెలిపింది. అయితే ఆ చిత్రం గురించి తనను ఎవరూ సంప్రదించలేదని ఆమె పేర్కొంది. అసలు ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారనే విషయంలోనూ తనకు క్లారిటీ లేదని చెప్పింది. అన్నట్టు ధనుష్ హీరోగా వచ్చిన పుదుపెట్టై సినిమాలో స్నేహ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ధూల్‌పేట టైటిల్‌తో తెలుగులో అనువాదం అయ్యింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

