పడి లేచే కెరటంలా..
ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ రాసిన ‘విల్' పుస్తకం తననెంతగానో ప్రభావితం చేసిందని చెప్పింది అగ్రనాయిక సమంత. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా రెట్టించిన ఉత్సాహంతో జీవన సంగ్రామంలోకి దూకాలనే ైస్థెర్యాన్నిచ్చిందని వ్యాఖ్యానించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో
ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ రాసిన ‘విల్’ పుస్తకం తననెంతగానో ప్రభావితం చేసిందని చెప్పింది అగ్రనాయిక సమంత. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా రెట్టించిన ఉత్సాహంతో జీవన సంగ్రామంలోకి దూకాలనే ైస్థెర్యాన్నిచ్చిందని వ్యాఖ్యానించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ పుస్తకంలోని ఓ కొటేషన్‌ను పోస్ట్ చేసింది సమంత. ‘ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపే అద్భుతమైన పుస్తకమిది. మన ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగిపోవద్దు. పునరుత్తేజితులమై కొత్త జీవితానికి స్వాగతం పలకాలి. ఎప్పటికీ జీవితం పట్ల ఆశను మాత్రం వదులుకోవద్దు’ అని సమంత ఈ పుస్తకం గురించి పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సమంత అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంతకు సంబంధించిన సోషల్‌మీడియా పోస్ట్‌లలో తాత్వికత. ఆశావహదృక్పథం ధ్వనిస్తున్నదని ఆమె అభిమానులు చెబుతున్నారు. తనలోని నిరాశనిస్పృహల్ని దూరం చేసుకోవడానికి పుస్తక పఠనంతో పాటు కొత్త ప్రదేశాల సందర్శనకు సమంత ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నదని అంటున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో ‘శాకుంతలం’ ‘యశోద’ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- actor
- Actress
- book
- Hollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

