Actress Poorna | ఘనంగా నటి పూర్ణ సీమంతం.. వీడియో వైరల్..!
మలయాళ నటి పూర్ణ సీమంతం వేడుకగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోను పూర్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Actress Poorna | మలయాళ నటి పూర్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె అసలు పేరు షమ్న ఖాసిమ్. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, ‘అవును’, ‘సీమ టపాకాయ్’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నెలలో దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకున్న పూర్ణ.. అనంతరం కొద్ది రోజులకే తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదివారం పూర్ణ సీమంతం వేడుకగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోను పూర్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
పూర్ణ.. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 24న దుబాయ్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వివాహానికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అనంతరం డిసెంబర్ 31వ తేదీన తల్లికాబోతున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

