Keerthy Suresh | కీర్తి సురేశ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందా..? వైరలవుతున్న నటి కామెంట్స్
Keerthy Suresh | మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh) పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘మామన్నన్’ చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా నటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh | తొలి సినిమా ‘నేను శైలజా’తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిపోయింది మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh). మొదటి సినిమాతోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. ఇక ‘మహానటి’తో ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకుంది. నటనలో ఏకంగా నేషనల్ అవార్డు గెలుచుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.సావిత్రి బయోపిక్లో ఇంత కన్నా బాగా ఎవరు నటించలేరెమో అనేంతలా తన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కీర్తి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ఓ వైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు గ్లామర్ పాత్రలతోనూ అదరగొడుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.
కాగా, కీర్తి సురేశ్ గురించి సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఆమె ప్రేమ, పెళ్లి గురించి అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఎలాంటి నిజం లేదని.. ఇలాంటి వార్తలు తనను బాధించాయని ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ తెలిపింది. ఇదిలా ఉండగా.. కీర్తి సురేశ్ పొలిటికల్ ఎంట్రీపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్ తాజాగా నటించిన మూవీ ‘మామన్నన్’ (Maamannan). తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udayanidi stallin) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను.. తమిళ స్టార్ డైరెక్టర్ మారీ సెల్వరాజ్(Mari selvaraj) తెరకెక్కిస్తున్నారు. వడివేలు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.మామన్నన్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేశ్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు.
మామన్నన్ ఒక రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రం అని చెప్పారు. ఇందులో తనది చాలా సీరియస్ పాత్ర అని తెలిపారు. ఇక ఇటీవలే కొందరు తనను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని అడుగుతున్నారని.. ఆ విషయం గురించి ఆలోచించాలి అని కీర్తి చెప్పుకొచ్చారు. నటి కామెంట్స్ తో రాబోయే రోజుల్లో కీర్తి రాజకీయ ప్రవేశం చేస్తారని కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
గతంలోనూ కీర్తి పొలిటికల్ ఎంట్రీపై అనేక వార్తలు వచ్చాయి. కీర్తి సురేశ్ బీజేపీలో చేరుతోందంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, తన కూతురికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని కీర్తి తల్లి మేనక స్పష్టం చేశారు. తాజాగా కీర్తి కామెంట్స్ తో మరోసారి పొలిటికల్ ఎంట్రీ తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం ఆమె మంత్రి ఉదయ నిధి స్టాలిన్ తో కలిసి సినిమా చేస్తుండటంతో నటి కామెంట్స్ కు బలం చేకూరుస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని.. ఈ పరిచయంతోనే రాబోయే రోజుల్లో కీర్తి పొలిటికల్ ఎంట్రీ ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది.
Also Read..
Captain Cool | కెప్టెన్ కూల్ ధోనీ కాదట.. ఎవరో చెప్పిన గవాస్కర్
Wrestlers | ఇకపై రోడ్డెక్కబోం.. కోర్టులో తేల్చుకుంటాం : రెజ్లర్ల కీలక నిర్ణయం
Himachal Pradesh Floods | హిమాచల్ లో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న పర్యాటకులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

