‘మా’ అధ్యక్ష రేసులో హేమ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది ఉత్కంఠగా మారబోతున్నాయి. ఇప్పటికే అధ్యక్షపదవి కోసం పోటీపడనున్నట్లు ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్రకటించారు. వారితో పాటు జీవితా రాజశేఖర్ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ‘మా’ అధ్యక్ష పదవి కోసం తాను పోటీచేయబోతున్నట్లు సీనియర్ నటి హేమ ప్రకటించింది. ఆమె మాట్లాడుతూ ‘గతంలో ‘మా’ ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పనిచేశా. ఈసారి ట్రెజరర్ పదవికి పోటీచేయాలనుకున్నా. ప్రస్తుతం నా ఆలోచన మారింది. ఈ ఏడాది ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు, జీవిత పోటీచేస్తున్నారని తెలిసింది. పెద్దలంతా ఎలక్షన్ బరిలో దిగుతున్నారని తెలిసిన తర్వాత వివాదాల్లో చిక్కుకోకూడని పోటీనుంచి విరమించుకోవాలనుకున్నా. గతంలో నన్ను గెలిపించిన స్నేహితులందరూ ఎన్నికల్లో నిలబడాలని ఒత్తిడి తేవడంతో ఇండిపెండెంట్‌గా అధ్యక్ష పదవి కోసం పోటీ చేయాలనుకుంటున్నా’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

