Actress | ఏంటి.. ఈ ముద్దుగుమ్మ ప్రగ్నెంటా.. ఆ పని చేయడంతో అందరిలో అనేక అనుమానాలు..!
Actress | ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరు హీరోయిన్స్ పండంటి బిడ్డలకి జన్మనిచ్చాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలు స్టార్ జంటలు కొత్త జీవితాన్ని ప్రారంభించగా, కొందరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.
Actress | ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరు హీరోయిన్స్ పండంటి బిడ్డలకి జన్మనిచ్చాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలు స్టార్ జంటలు కొత్త జీవితాన్ని ప్రారంభించగా, కొందరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ గర్భవతి అన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి.మరి ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి, తన అందం, అభినయంతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
తరువాత పలు హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. అలాగే సౌత్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి ‘లింగ’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. గత ఏడాది సోనాక్షి తన చిన్ననాటి స్నేహితుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇద్దరూ పలు ఈవెంట్లలో కలిసి కనిపిస్తూ బాలీవుడ్లో ట్రెండింగ్ కపుల్‌గా మారారు. ఇటీవల సోనాక్షి ఓ సినీ ఈవెంట్‌కి హాజరైంది. అయితే ఆమె లూజ్ డ్రస్‌లో కనిపించడంతో నెటిజన్లు ఆమె గర్భవతి అంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఈ వార్తలు వేగంగా వైరల్ అయ్యాయి.
ఈ వార్తలపై సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. తన భర్త జహీర్‌తో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, తాను ప్రెగ్నెంట్ కాదని స్పష్టంగా తెలిపింది. “ఇలాంటి రూమర్స్ చదవడం నిజంగా ఫన్నీగా ఉంది. దయచేసి ఊహాగానాలు ఆపండి,” అని ఆమె పేర్కొంది.సోనాక్షి ఇప్పుడు టాలీవుడ్ వైపు దృష్టి సారిస్తోంది. ఆమె హీరో సుదీర్ బాబుతో కలిసి నటిస్తున్న ‘జటాధర’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో సోనాక్షి నెగటివ్ రోల్లో కనిపించనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి. ఇప్పుడు ఆమె దృష్టి పూర్తిగా తెలుగు ప్రాజెక్ట్ ‘జటాధర’పై ఉంది. అభిమానులు కూడా ఈ సారీ ఆమెను కొత్త అవతారంలో చూడబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

