ముంబై: ఫోర్న్ సినిమాల కేసులో నిందితురాలిగా ఉన్న నటి గెహనా వశిష్ఠ్ ఓ ఇల్లాలైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఫైజన్ అన్సారీని ఆమె వివాహం చేసుకుంది. నటి గెహనా వశిష్ఠ్, ఫైజన్ అన్సారీ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరూ వివాహం చేసుకున్నారు. గెహనా వశిష్ఠ మెడలో ఫైజన్ అన్సారీ తాళి కట్టాడు.
ఈ వివాహనానికి సంబంధించిన ఫొటోలను నూతన దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోల్లో ఫైజన్ అన్సారీ పెళ్లి కొడుకుగా, గెహనా వశిష్ఠ్ పెళ్లి కుమార్తెగా సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై ఉన్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, రాజ్‌కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న పోర్న్ సినిమాల కేసులో గెహనా కూడా నిందితురాలిగా ఉన్నది. ప్రస్తుతం బెయిల్‌పై బయటికి వచ్చింది.