Anasuya – Vijay Devarakonda | విజయ్ దేవరకొండతో వివాదంపై స్పందించిన అనసూయ
Anchor Anasuya Bharadwaj | టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు, యాంకర్ అనసూయకు మధ్య వివాదం ఉన్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో వీళ్లిద్దరి మధ్య గోడవ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి వీళ్ల మధ్య మనస్పర్థలు పెరుగుతూనే వచ్చాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఖుషీ ఫస్ట్ లుక్ పోస్టర్ పై కూడా అనసూయ విమర్శలు చేసింది.
Anchor Anasuya Bharadwaj | టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు, యాంకర్ అనసూయకు మధ్య వివాదం ఉన్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో వీళ్లిద్దరి మధ్య గోడవ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి వీళ్ల మధ్య మనస్పర్థలు పెరుగుతూనే వచ్చాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఖుషీ ఫస్ట్ లుక్ పోస్టర్ పై కూడా అనసూయ విమర్శలు చేసింది. ఇక రౌడీ ఫ్యాన్స్ కూడా అనసూయపై అదే రేంజ్ లో ట్రోల్స్ చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ వీళ్లద్దిర మధ్య వివాదం మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. కాగా తాజాగా మరోసారి అనసూయ ఈ వివాదంపై మంట పెట్టినట్లు తెలుస్తుంది.
జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం సింబా. ఈ సినిమాకు మురళి మనోహర్ దర్శకత్వం వహిస్తుండగా.. సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 09న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా మూవీ నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్లో అనసూయ ఒక సిగ్నల్ దగ్గర ఆగి ఉండగా.. ఒకతను వచ్చి తన బండి తుడుస్తూ.. అక్క అక్క నీకు మహేశ్ బాబు లాంటి మొగుడు వస్తాడు అక్క అంటాడు. దీనికి అనసూయ నో అన్నట్లు ఫేస్ పెడుతుంది. అతను మళ్లి అనసూయ బండి తుడుస్తూ.. పోని విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు అక్క అంటాడు దీనికి అనసూయ నవ్వుకుంటూ వెళుతుంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ వేడుకను నిర్వహించగా.. ఈ వేడుకలో ఒక రిపోర్టర్ అనసూయను అడుగుతూ.. మీకు విజయ్ దేవరకొండకు మధ్య గొడవ సద్దుమణిగిందా అని అడుగుతాడు. దీనికి అనసూయ సమాధానమిస్తూ.. నేను ఈ విషయంపై స్పందిచాలి అనుకోట్లేదు. సినిమాలో ఎలాగైతే సందేశం ఇస్తామో అలాగే నేను ఇవ్వాలి అనుకున్నాను. మా మధ్య అంతా పెద్ద గోడవ జరగలేదు. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్ లైట్లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అది లిమిట్స్ దాటినప్పుడు అందరికీ అర్థమవుతుంటాయ్. ఆరోజు ఎవరు స్పందిచకపోవడంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. అంతే తప్ప నాకు ఎవరు మీద కోపం లేదు. అంటూ తెలిపింది.
#Anasuya on issue with #VD #Simbaa Trailer launch
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) July 24, 2024
ప్రస్తుతం అనసూయ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలలో నటిస్తుంది. అందులో పుష్ప ది రూల్ కూడా ఒకటి. తొలిపార్టులో మంగళం శ్రీను భార్యగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక సీక్వెల్ లో ఈమె పాత్రకు మరింత స్కోప్ ఉండనుందని తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

