మేకప్‌కే 4గంటలు పట్టేది!
రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్' జనవరి 10న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ ముఖ్య పాత్రను పోషించారు.
రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘దర్శకుడు శంకర్‌తో పనిచేయాలని ప్రతి ఆర్టిస్టు కోరుకుంటాడు. ఈ సినిమాతో నాకు ఆ అదృష్టం దక్కింది. ఇందులో నేను సీఎం పాత్రను పోషించా. లుక్పరంగా ప్రోస్థటిక్ మేకప్‌తో కనిపిస్తా. నేను ఇప్పటివరకు ఆ తరహా మేకప్ వేసుకొని నటించలేదు.
మేకప్‌కే నాలుగు గంటల టైమ్ పట్టేది’ అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర డిఫరెంట్ షేడ్స్‌తో సాగుతుందని, ఎన్నో సస్పెన్స్‌లతో థ్రిల్‌ని పంచుతుందని, కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుందని శ్రీకాంత్ తెలిపారు. ‘గోవిందుడు అందరివాడే’ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటించానని, ఇప్పుడు తను నటనలో మరింత పరిణితి సాధించి గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడని, రామ్‌చరణ్ పోషించిన అప్పన్న పాత్రను చూస్తే అందరూ షాక్ అవుతారని చెప్పారు. డేట్స్ సర్దుబాటు కానీ కారణంగానే ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఆలస్యమైందని,నిర్మాత దిల్‌రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారని శ్రీకాంత్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

