Sonu Sood | కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్లో సోనూసూద్ సందడి.. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తా అంటూ హామీ
Sonu Sood | కుమారి ఆంటీ (Kumari Aunty) ఫుడ్ స్టాల్లో ప్రముఖ స్టార్ నటుడు సోనూసూద్ (Sonu Sood) సందడి చేశారు.
Sonu Sood | గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ (Kumari Aunty). హైదరాబాద్ (Hyderabad)లోని మాదాపూర్‌లో రోడ్డు పక్కన ఓ ఫుడ్ స్టాల్ నడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె చెప్పిన ‘మీది మొత్తం రూ.1000 అయ్యింది. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి యూట్యూబర్లు, సినీ తారలు ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు క్యూ కడుతున్నారు. తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్లో ప్రముఖ స్టార్ నటుడు సోనూసూద్ (Sonu Sood) సందడి చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం ఐటీసీ కోహినూర్ పక్కన స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్న కుమారి ఆంటీ వద్దకు వెళ్లిన సోనూసూద్ అక్కడున్నవారందరినీ సర్ప్రైజ్ చేశారు. కుమారి ఆంటీని కలిసి శాలువాతో సత్కరించి బోకే ఇచ్చారు. అనంతరం ఆమెతో సరదాగా మాట్లాడారు. పంచ్‌లు వేస్తూ అక్కడున్న వారిని నవ్వించారు. ఫుడ్ సర్వ్ చేశారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు కుమారీ ఆంటీ బెస్ట్ ఉదాహరణగా సోనూ సూద్ అభివర్ణించారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం అవసరమైన చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కుమారి ఆంటీని సోనూ సూద్ కలిసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
YOU ARE YOUR ONLY LIMIT..
Kumari aunty is a testament to the quiet strength and fierce resilience that resides in each woman..let us support, celebrate, uplift and empower these bearers of boundless strength by our words and actions ..#WomenEmpowerment pic.twitter.com/ETUR8jduGu— sonu sood (@SonuSood) July 5, 2024
Also Read..
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. బావిలో విషవాయువు పీల్చి ఐదుగురు మృతి
Rishi Sunak | నన్ను క్షమించండి.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

