కోవిడ్ టైమ్లో సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు నటుడు సోనూ సూద్. ఆయన సాయం కోసం వచ్చిన విజ్ఞప్తుల్లో ఎక్కువగా ఐఏఎస్ కోచింగ్ కోసం ఉండగా..గతేడాది సంభవం పేరుతో ఆన్లైన్ కోచింగ్ కార్యక్రమం ప్రారంభించారు. ఐఏఎస్ కోసం సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు.
ఒక బ్యాచ్ ఇప్పటికే పూర్తి అవగా..తాజాగా రెండో బ్యాచ్ కోచింగ్ ప్రారంభించారు. ఎంపిక చేసిన విద్యార్థులకు దేశంలోని ప్రముఖ కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ నుంచి శిక్షణ ఇప్పించనున్నారు. ఐఏఎస్ కోచింగ్ కొత్త బ్యాచ్ ప్రారంభించడంపై సోనూసూద్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన ఫౌండేషన్ ద్వారా సేవలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.