Satyam Rajesh | కొత్త కాన్సెప్ట్లకే ప్రాధాన్యతనిస్తా .. అప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటాం: సత్యం రాజేష్
‘పొలిమేర-2’ చిత్రంతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు సత్యం రాజేష్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం సత్యం రాజేష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఓ అపార్ట్మెంట్లో జరిగే కథ ఇది.
Satyam Rajesh | ‘పొలిమేర-2’ చిత్రంతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు సత్యం రాజేష్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం సత్యం రాజేష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఓ అపార్ట్మెంట్లో జరిగే కథ ఇది. భార్యభర్తల మధ్య వచ్చే సమస్యల గురించి చర్చిస్తుంది. ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితంలో అనూహ్యంగా చోటుచేసుకున్న సంఘటనలేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. మర్డర్ మిస్టరీ కథ కాబట్టి ప్రతి సన్నివేశం ఉత్కంఠను పంచుతుంది’ అన్నారు.
ఆర్టిస్టుగా తన పరిమితులేమిటో తనకు తెలుసునని, అందుకే కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తున్నానని సత్యం రాజేష్ తెలిపారు. ‘భారీ బడ్జెట్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను కోరుకోవడం లేదు. మంచి పాయింట్ ఉన్న సినిమాలు చేయాలన్నదే నా కోరిక. ఎలాంటి అంచనాలు లేని సినిమాలు చేసినప్పుడే ఒత్తిడి లేకుండా కెరీర్లో నిలదొక్కుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ‘స్ట్రీట్ ఫైట్’ చిత్రంలో మెయిన్‌లీడ్‌లో నటిస్తున్నానని, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నానని సత్యం రాజేష్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

