Prabhas | ప్రభాస్ పుట్టిన రోజున రాజాసాబ్ టీజర్..!
‘కల్కి’ సినిమాతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఈ ఆనందోత్సాహంలో తన తదుపరి సినిమాల కోసం సన్నద్ధమవుతున్నారు. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
Prabhas | ‘కల్కి’ సినిమాతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఈ ఆనందోత్సాహంలో తన తదుపరి సినిమాల కోసం సన్నద్ధమవుతున్నారు. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇదిలావుండగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాజాసాబ్’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూలైలో విడుదల చేసిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రభాస్ రొమాంటిక్ లుక్స్‌తో ఫిదా చేశారు.
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది. ప్రభాస్ జన్మదినమైన అక్టోబర్ 23న టీజర్‌ను విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ‘రాజాసాబ్’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ప్రభాస్ తన షూటింగ్ పార్ట్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. తాజా షెడ్యూల్లో ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

