యువహీరో నిఖిల్ లైవ్ వెపన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. శత్రువులపై గురిచూసి ఆయుధాల్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా ఆయన నటిస్తున్న తాజా సినిమా సన్నద్ధతలో భాగమే. నిఖిల్ హీరోగా ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నది. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా రెండో షెడ్యూల్ మార్చి నుంచి మనాలీలో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్లో రోమాంచితమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నారు. అందుకోసం నిఖిల్ లైవ్ వెపన్, స్టంట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం సోషల్‌మీడియాలో ఫొటోలను పంచుకున్నారు. స్పైథ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఐశ్వర్యామీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జూలియన్ అమరు ఎస్ట్రాడా, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఆర్ట్: అర్జున్ సూరిశెట్టి, ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంటోని, సీఈఓ: చరణ్‌తేజ్, రచన: అనిరుధ్ కృష్ణమూర్తి, ఎడిటర్, దర్శకత్వం: గ్యారీ బీహెచ్.