Ante sundaraniki | సినిమారంగంలోకి రాకపోయుంటే నాని ఆ పని చేసేవాడట!
Ante sundaraniki Movie Promotions | నాని.. తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నటుడు. ఈయన నుంచి సినిమా వస్తుందంటే మరో ఆలోచన లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తుంటారు. ఎందుకంటే నాని సినిమాలలో ఎలాంటి వల్గారిటీ గాని, బోల్డ్ సీన్స్గాని లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేవిధంగా ఉంటాయి. ఫలితంతో సంబంధంలేకుండా కొత్త కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఏటా ఒకటి, రెండు సినిమాలతో సినీ ప్రేమికులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రంపై ప్రేక్షకులలో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేశాయి. నాని ఈ సారి పూర్తి స్థాయి వినోదభరిత పాత్రలో ప్రేక్షకులను నవ్వించడానికి వస్తున్నట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటుంది. ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నాని సినిమా రంగంలోకి రాకపోయుంటే థియేటర్లో టికెట్ కలెక్టర్ అయ్యుండేవాడినని, ఎందుకంటే ప్రతి షో ఫ్రీగా చూసేయోచ్చు కదా అని తాజాగా జరిగిన ఇంటర్వూలో తెలిపాడు. ఇక అంటేసుందరానికీ చిత్రంలో నానికి జోడీగా నజ్రియా హీరోయిన్గా నటించింది. నజ్రియా తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో నాని బ్రహ్మణుడి పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

