Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Actor Imran Khan | ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ భారతదేశాన్ని అక్టోబర్ 28 నాటికి వీడాలని ముంబైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Actor Imran Khan | ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ భారతదేశాన్ని అక్టోబర్ 28 నాటికి వీడాలని ముంబైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని క్రాంతి మైదాన్ వద్ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జరిగిన ఒక రాజకీయ నిరసన కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొనడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఈ చర్య తీసుకున్నారు. అయితే అమెరికా పౌరసత్వం కలిగి ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కి భారత ప్రభుత్వం నుంచి ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ కూడా ఉంది. అయితే ఈ కార్డ్ వలన విదేశియులకు వర్తించే సౌకర్యాలతో పాటు నిబంధనలపై ప్రస్తుతం నెట్టింటా చర్చ జరుగుతుంది. కాగా.. అసలు ఈ ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డు వలన ప్రయోజనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
2005లో ప్రవేశపెట్టిన ఓసీఐ పథకం ద్వారా విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు భారతదేశాన్ని రావడానికి, ఇక్కడ నివసించడానికి మరియు కొన్ని ఆర్థిక, విద్యాపరమైన ప్రయోజనాలను పొందడానికి జీవితకాల వీసా సదుపాయం లభిస్తుంది. అయితే, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వంద్వ పౌరసత్వం (Dual Citizenship) కాదని, ఓసీఐ హోల్డర్లు కేవలం విదేశీ పౌరులు మాత్రమేనని చట్టం స్పష్టం చేస్తోంది. భారతీయులకు లభించే రాజకీయ హక్కులు, ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేయడం లేదా ప్రభుత్వ ఉద్యోగాలు వంటివి ఓసీఐ హోల్డర్లకు వర్తించవు. అలాగే వ్యవసాయ భూములు, ఫామ్‌హౌస్‌లను కొనుగోలు చేయడానికి వీరికి అనుమతి లేదు. భారత రాజ్యాంగం ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ మరియు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కులు భారతీయ పౌరులకే ప్రత్యేకంగా వర్తిస్తాయి కానీ విదేశీయులకు ఆ సంపూర్ణ హక్కులు ఉండవు. ఈ నిబంధనల ఉల్లంఘన కింద విదేశీయుల చట్టం (Foreigners Act) మరియు ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం విదేశీ పౌరులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

