Abbas | ఆ స్టార్ హీరో సినిమాతో అబ్బాస్ రీ ఎంట్రీ?
Abbas Re-Entry | అబ్బాస్.. 90ల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటుడు. ఎంతో మంది అమ్మాయిల మనసు దోచుకున్న మన్మధుడు. యూత్‌తో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ‘ప్రేమ దేశం’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ అనతికాలంలోనే స్టార్ హీరో స్టేటస్‌ను దక్కించుకున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. కానీ ఎక్కువ కాలం స్టార్‌గా నిలవలేకపోయాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో కీలకపాత్రల్లో నటిస్తూ అప్పుడప్పుడు ప్రేక్షకులను పలకరించేవాడు. 2015తర్వాత సినిమాల్లో నటించడం మానేసాడు. ప్రస్తుతం ఇతర రంగంలో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన రీ ఎంట్రీపై పలు వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అబ్బాస్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అది కూడా తెలుగు సినిమాతో ఇవ్వనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్. మ్యాచోస్టార్ గోపిచంద్, శ్రీవాస్‌తో హ్యట్రిక్ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కీలకపాత్రలో నటించడానికి మేకర్స్ అబ్బాస్‌తో సంప్రదింపులు జరిపారు. పాత్ర నచ్చడంతో అబ్బాస్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అబ్బాస్ చివరిగా మలయాళంలో 2015లో వచ్చిన ‘పచ్చకళ్ళం’ సినిమాలో నటించాడు. ఇక తెలుగులో 2013లో ‘అలా జరిగింది ఒక రోజు చిత్రం’లో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

