ACP Vishnu Murthy | అల్లు అర్జున్ ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. లేకుంటే తోలు తీస్తాం.. ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్..!
ACP Vishnu Murthy | సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఘటనపై స్పందించారు. హీరో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై స్పందించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ సైతం మీడియా సమావేశం నిర్వహించారు.
ACP Vishnu Murthy | సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఘటనపై స్పందించారు. హీరో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై స్పందించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ సైతం మీడియా సమావేశం నిర్వహించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఈ వ్యవహారంలో ఏసీపీ విష్ణుమూర్తి తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఓ రిమాండ్ ఖైదీ అని.. కేసు విచారణ కోర్టులో ఉండగా ముద్దాయి ప్రెస్‌మీట్ పెట్టొచ్చా? అని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ వద్ద గ్యాదరింగ్ వద్ద పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ వినలేదని ఆరోపించారు.
అల్లు అర్జున్ బాధ్యత పౌరుడిగా ప్రవర్తించలేదని మండిపడ్డారు. సంథ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ బౌన్సర్ల తోపులాటతోనే మహిళా చనిపోయిందన్నారు. బౌన్సర్లతో దౌర్జన్యం కరెక్ట్ కాదని, పబ్లిక్ ప్లేసులలో సెలెబ్రెటీలు బాధ్యతగా వ్యవహరించాలనన్నారు. పోలీసులు తమ విధులను సరిగానే వ్యవహరించారని.. పోలీసులంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. అధికారులను ఇష్టం వచ్చినట్లు తిడితే రీల్స్ కట్ చేస్తామంటూ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసుల మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని, విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నారని ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తామన్నారు. సినిమా వాళ్ల బట్టలు ఊడతీస్తామని.. మీరు ఉన్నదే లీజు జాగాలో.. జూబ్లీహిల్స్ ఏరియాలో మీకు అంత పెట్టి డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు.
అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ఇండస్ట్రీ అభివృద్ధి కావాలని మీకు భూములు ఇచ్చారని.. వాపు చూసి బలం అనుకోవదన్నారు. సినిమా వాళ్ల దాదాగిరి ఏంటీ? అని నిలదీశారు. ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచారని.. ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీయమని మేము బ్రతిమిలాడామా? అన్నారు. అసలు అల్లు అర్జున్ కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా? అంటూ ప్రశ్నించారు. పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు.. నీకు ఎందుకు చెప్పాలి నువ్వు ఏమన్నా తీస్మార్ ఖాన్ అనుకుంటున్నావా? నువ్వు మామూలు పౌరుడివి.. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు. అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది.. నీ గురించి మేము ఎందుకు బాధపడాలన్నారు. తెలంగాణ సమాజం సౌమ్యులు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారంటూ స్పందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రెండు జాతీయ పార్టీలకు ఆ విలువ ఎప్పటికీ అర్థం కాదు.. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై ఎక్స్‌లో కేటీఆర్
IndiGo Flight | విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. పుణె ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్..!
Crazy Kalyanam | ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ ‘క్రేజీ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Hit and run | ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్.. బాలుడికి గాయాలు
Train accident | కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

