షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం ‘జవాన్’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 129 కోట్ల కలెక్షన్స్ సాధించింది. రెండో రోజు 80కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజు కలెక్షన్స్‌లో తగ్గుదల కనిపించినా కేవలం రెండు రోజుల్లో 200కోట్ల మార్క్‌ను అందుకోవడం ఇప్పటివరకు భారతీయ సినిమాలో రికార్డని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రం హిందీ బెల్ట్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధిస్తున్నదని, మొత్తం వసూళ్లలో దాదాపు 70 శాతం అక్కడివేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. రాబోవు వారాంతంలో మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని, లాంగ్న్‌ల్రో ఈ చిత్రం వెయ్యి కోట్ల మైలురాయిని దాటే అవకాశం ఉందని అంటున్నారు. గురువారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది.