Abhishek Bachchan | అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నా..! హాట్ టాపిక్‌గా అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా పోస్ట్..!
Abhishek Bachchan | బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘కొంతకాలం అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నా.. నన్ను నేను తెలుసుకోవాలనుంది’ అంటూ గతరాతి సమయంలో ఓ భావోద్వేగమైన సందేశాన్ని షేర్ చేశారు అభిషేక్.
Abhishek Bachchan | బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘కొంతకాలం అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నా.. నన్ను నేను తెలుసుకోవాలనుంది’ అంటూ గతరాతి సమయంలో ఓ భావోద్వేగమైన సందేశాన్ని షేర్ చేశారు అభిషేక్. ‘నేను కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. నాకిష్టమైన వాళ్లందరికీ నాకు ఉన్నదంతా ఇచ్చేశాను. ఇప్పుడు నాకోసం కొంత సమయం కావాలి’ అంటూ అభిషేక్ పోస్ట్‌లో తెలిపారు. ‘కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అందరికీ దూరంగా ఉండాలి’ అని పేర్కొంటూ ఓ సందేశం ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
పలువురు అభిమానులు స్పందిస్తూ ప్రశ్నలు కురిపించారు. ‘నటనకు గ్యాప్ తీసుకుంటున్నారా?’ అని ప్రశ్నించగా.. మరికొందరు ‘త్వరలోనే కొత్త అభిషేక్‌ను చూడబోతున్నాం’ అంటూ మరొక యూజర్ స్పందించాడు. ఇదిలా ఉండగా.. అభిషేక్ చివరిసారిగా ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాలో కనిపించారు. అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, సంజయ్ దత్ వంటి స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ఆయన ‘రాజా శివాజీ’ అనే పవర్ఫుల్ బయోపిక్‌లో నటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ జీవిత ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి రితేశ్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆయన భార్య జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

