డ్రగ్స్ రహిత సమాజం కోసం
సందేశాత్మక ఇతివృత్తంగా దర్శక-నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన బాలల చిత్రం ‘అభినవ్'. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర ఇందులో కీలక పాత్రధారులు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్బంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
సందేశాత్మక ఇతివృత్తంగా దర్శక-నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన బాలల చిత్రం ‘అభినవ్’. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర ఇందులో కీలక పాత్రధారులు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్బంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్. విద్యార్థులనూ ఈ పిశాచి వదలడంలేదు. అభినవ్ అనే సాహస బాలుడు ఈ గంజాయి మాఫియా ఆట ఎలా కట్టించాడు? అనే సందేశాత్మక కథాంశంతో ఈసినిమా రూపొందింది. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఈసినిమా నిర్మించాం. ఇంకా ఇందులో మరెన్నో సామాజిక అంశాలను స్పృశించాం.’ అని దర్శకనిర్మాత భీమగాని సుధాకర్‌గౌడ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, సంగీతం: వందేమాతం శ్రీనివాస్, నిర్మాణం: శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

