Exam Trailer | అబ్బాస్ సెకండ్ ఇన్నింగ్స్.. ఆకట్టుకుంటున్న ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్ ట్రైలర్!
Exam Trailer | తమిళ నటుడు అబ్బాస్ తన సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే 'హ్యాపిరాజ్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Exam Trailer | తమిళ నటుడు అబ్బాస్ తన సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ‘హ్యాపిరాజ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుత పోటీ పరీక్షల ప్రపంచంలో జరిగే అక్రమాలు, పేపర్ లీకేజీలు మరియు వ్యవస్థలోని లొసుగుల ఇతివృత్తంతో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ‘ఎగ్జామ్’ (Exam). ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 15 నుంచి తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే, కథ అంతా పోటీ పరీక్షల ప్రపంచంలో జరిగే అవినీతి చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. ఒక సామాన్య యువతి (దుశారా విజయన్) ఈ వ్యవస్థలోని లోపాలను ఎలా ఎండగట్టిందనేది ఇందులో ప్రధానాంశం. దుశారా విజయన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించగా, అబ్బాస్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సిరీస్కు ప్రముఖ మేకర్స్ పుష్కర్ – గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించగా, ఎ. సర్కుణం దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

