పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాం..
‘ఇది పక్కా గోదారోళ్ల సినిమా. నవ్వి నవ్వి థియేటర్ల నుంచి బుగ్గలు, పొట్ట నొప్పితో బయటకు వస్తారని గ్యారెంటీగా చెప్పగలను. పిఠాపురంలో ఈ వేడుక జరపడం ఆనందంగా ఉంది. మా సంగీత దర్శకుడు రామ్ మిర్యాలది ఈ ఊరే అని ఇప్పుడే తెలిసింది.
‘ఇది పక్కా గోదారోళ్ల సినిమా. నవ్వి నవ్వి థియేటర్ల నుంచి బుగ్గలు, పొట్ట నొప్పితో బయటకు వస్తారని గ్యారెంటీగా చెప్పగలను. పిఠాపురంలో ఈ వేడుక జరపడం ఆనందంగా ఉంది. మా సంగీత దర్శకుడు రామ్ మిర్యాలది ఈ ఊరే అని ఇప్పుడే తెలిసింది. అందుకే.. ఇందులోని పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశారాయన. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది.’ అని బన్నీ వాస్ అన్నారు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘ఆయ్’. అంజి కె.మణిపుత్ర దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని పిఠాపురంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బన్నీవాసు మాట్లాడారు. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరంతా సక్సెస్ రూపంలో ఇవ్వాలని నార్నె నితిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రైలర్ ఎంత ఎంజాయ్ చేశారో, సినిమాను అంతకు మించి ఎంజాయ్ చేస్తారని, నవ్విస్తూనే చిన్న చిన్న ఎమోషన్స్ టచ్ చేశామని దర్శకుడు అంజి కె.మణిపుత్ర చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులతోపాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

