AAY Movie | ‘ఆయ్’ ట్రైలర్ రిలీజ్.. ఎన్టీఆర్ బావమరిది మళ్లీ హిట్ కొట్టేలా ఉన్నాడే.!
AAY Movie | మ్యాడ్ సినిమాతో గతేడాది హిట్ కొట్టిన అగ్ర నటుడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఈసారి మరో ఫన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం ఆయ్(). ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
AAY Movie | మ్యాడ్ సినిమాతో గతేడాది హిట్ కొట్టిన అగ్ర నటుడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఈసారి మరో ఫన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం ఆయ్ (AAY). ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది.
అయితే ఆయ్ మూవీ ట్రైలర్, పాటలు చూసిన ప్రేక్షకులు ఈ మూవీ యూత్‌ని బాగాఆకట్టుకోబోతుందని చెబుతున్నారు. మరోవైపు ఆయ్ సినిమా గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండటం మూవీ విడుదల తర్వాత రాఖీ పండుగతో పాటు లాంగ్ వీకెండ్ వస్తుండటంతో మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్లు చిత్రయూనిట్ అలోచిస్తున్నట్లు సమాచారం. అయితే అదేరోజు టాలీవుడ్లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్‌తో పాటు రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలు థియేటర్లు లేక కొట్టుకుంటుంటే ఈ మధ్యలోకి ఎన్టీఆర్ బావమరిది చిత్రం ఆయ్ వచ్చి చేరింది.
అంజి కంచిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ మిరియాల ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆయ్ సినిమాకు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేస్తే మాత్రం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఒకింత ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఆయ్ సినిమా ఇతర భాషల్లో సైతం విడుదలవుతుందేమో తెలియాల్సి ఉంది.
Also Read..
Aryan Khan | బ్రెజిల్ నటితో ఆర్యన్ ఖాన్ డేటింగ్?.. వీడియో వైరల్
Pakistan posters | ఓ వ్యక్తి ఇంట్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం
KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు : కేటీఆర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

