మోహన్‌భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆరంభం’. అజయ్ నాగ్.వి దర్శకుడు. అభిషేక్ వీటీ నిర్మాత. ఈ సినిమాకు చెందిన తొలి లిరికల్ సాంగ్‌ను హీరో శ్రీవిష్ణు చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కి శ్రీవిష్ణు శుభాకాంక్షలు అందించారు. ‘అనగా అనగా..’ అంటూ సాగే ఈ పాటకు స్వరూప్గోలీ సాహిత్యం, సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించగా, ఎస్పీ చరణ్ ఆలపించారు.
ఒక ఊరి నేపథ్యంగా ఆహ్లాదకర సంగీత, సాహిత్యాలతో ఈ పాట రూపొందిందని, త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దేవ్‌దీప్ గాంధీ కుందు, మాటలు: సందీప్ అంగిడి.