Aarambham Movie | కీడా కోలా ఫేమ్ రవీంద్ర విజయ్, మోహన్భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆరంభం’. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వి.టి (Abhishek) నిర్మిస్తుండగా, అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ (𝗨/𝗔) సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రయునిట్ తెలిపింది. లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దేవ్దీప్ గాంధీ కుందు, మాటలు: సందీప్ అంగిడి.
#Aarambham receives “𝗨/𝗔” rating! 💥
Experience the whirlwind of emotions on big screens near you soon! ❤🔥 @RavindraVijay1 @AjaynagV76733 @ramcrazy454 @VtAbhishek @SinjithYerramil @RavindraVijay1 @sandeepang56161 @mahesh_sanke @mallik_harsha @avtenterta64670 pic.twitter.com/yKkZIEyoFw
— GSK Media (@GskMedia_PR) April 15, 2024