కశ్మీర్ ఫైల్స్‌పై ప్రశంసలు.. అందరూ చూడాలని కోరిన ఆమిర్ ఖాన్
ముంబై : ఇటీవల రిలీజైన ద కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. కశ్మీర్ పండిట్ల ఊచకోత, వలసపై తీసిన ఆ సినిమా అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. అందరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని ఆమిర్ కోరారు. ట్రిపుల్ ఆర్ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న ఆమిర్‌ను మీడియా ప్రశ్నించింది. కశ్మీర్ ఫైల్స్ చూశారా అని ఆయన్ను అడగ్గా.. ఆ సమయంలో ఆమిర్ సమాధానం ఇచ్చారు. కచ్చితంగా ఆ సినిమాను చూస్తానని, చరిత్రలో ఆ ఘటన విషాదకరమైందని, కశ్మీర్ పండిట్లకు జరిగిన అన్యాయం బాధాకరమని, అలాంటి చిత్రాలను చూడాలని ఆయన అన్నారు. మానవత్వానికి సంబంధించిన అంశాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నట్లు ఆయన చెప్పారు. తప్పకుండా ఆ చిత్రాన్ని చూస్తానని, ఆ సినిమా సక్సెస్ కావడం సంతోషంగా ఉందన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

