Aamir Khan | ‘3 ఇడియట్స్’లో రాంచో పాత్రకు సోనమ్ వాంగ్చుక్కు సంబంధం లేదు.. అసలు నిజం చెప్పిన ఆమిర్
Aamir Khan | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తాజాగా ‘3 ఇడియట్స్’ సినిమాపై ఎన్నాళ్లుగానో ప్రచారంలో ఉన్న అపోహకు తెరదించారు. ఆ సినిమాలో ఆయన పోషించిన ‘రాంచో’ (ఫున్సుఖ్ వాంగ్డు) పాత్రను లడఖ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
Aamir Khan | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తాజాగా ‘3 ఇడియట్స్’ సినిమాపై ఎన్నాళ్లుగానో ప్రచారంలో ఉన్న అపోహకు తెరదించారు. ఆ సినిమాలో ఆయన పోషించిన ‘రాంచో’ (ఫున్సుఖ్ వాంగ్డు) పాత్రను లడఖ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (LIFF) ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆమిర్ ఖాన్, తన కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘లగాన్’ చిత్రం 25 ఏళ్ల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘3 ఇడియట్స్’ సినిమాలోని రాంచో పాత్ర, సోనమ్ వాంగ్‌చుక్ మధ్య ఉన్న సంబంధంపై ప్రశ్నలు ఎదురవగా, ఆమిర్ పూర్తి వివరణ ఇచ్చారు.
రాంచో పాత్రను సోనమ్ వాంగ్చుక్ను దృష్టిలో పెట్టుకుని రాశారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆమిర్ స్పష్టం చేశారు. ‘3 ఇడియట్స్’ సినిమా రూపొందించే సమయంలో మాకు సోనమ్ వాంగ్‌చుక్ గురించి అసలు తెలియదు. ఆ పాత్రకు ఆయన జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. అది కేవలం సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక అపోహ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల సినిమాలో ‘చతుర్ రామలింగం’ పాత్ర పోషించిన నటుడు ఓమి వైద్య చేసిన వ్యాఖ్యలను కూడా ఆమిర్ ప్రస్తావించారు. ఓమి చెప్పిన వీడియో నేను కూడా చూశాను. కానీ అది సరైన సమాచారం కాదు. బహుశా అతను అలా భావించి ఉండొచ్చు. కథ రచయితలు రాజ్‌కుమార్ హిరాణీ, అభిజాత్ జోషి, నేను… ఎవరికీ ఆ సమయంలో సోనమ్ వాంగ్‌చుక్ గురించి తెలియదు అని స్పష్టం చేశారు.
సినిమా పాత్రకు సంబంధం లేకపోయినా, సమాజం కోసం సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని ఆమిర్ కొనియాడారు. ఆయన చేస్తున్న మంచి పనులకు గౌరవం ఇవ్వడానికి ‘3 ఇడియట్స్’తో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన సేవలు స్వతంత్రంగా ఎంతో విలువైనవి అని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై కూడా ఆమిర్ స్పందించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం ఆయన చేస్తున్న నిరసనపై ఆందోళన వ్యక్తం చేస్తూ… ఆయన ఆరోగ్యం గురించి మేమంతా ఆందోళన చెందుతున్నాం. ఆయన త్వరగా కోలుకుని, ఈ దీక్షను శాంతియుతంగా ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఉద్యమానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

