కాకినాడలో ప్రత్యక్షమైన ఆమిర్ ఖాన్..!

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కొద్ది రోజులుగా లాల్‌సింగ్ చద్దా చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన ఆర్మీ ఆఫీసర్ బాలాగా కనిపించనున్నాడు. ఇక ఆమిర్ లాల్ సింగ్ పాత్ర పోషిస్తున్నాడు.ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్, హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఫారెస్ట్‌గంప్’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్ చద్దా’ తెరకెక్కుతుంది.
ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్న ఈ కామెడీ-డ్రామా చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. 105 కోట్ల బడ్జెతో నిర్మితమవుతోన్న ఇందులో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. మోనా సింగ్, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కోసం కాకినాడ చేరుకున్నారు ఆమిర్ ఖాన్.
బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత కాకినాడ చేరుకున్న ఆమిర్ శుక్రవారం నుండి షూటింగ్లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. కాకినాడ– ఉప్పాడ, బీచ్, పోర్టు, అమలాపురం సమీపంలో ఓడలరేవు బీచ్, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో జరిగే షూటింగ్లో ఆమిర్ పాల్గొంటారని సమాచారం. ఇప్పటికే కార్గిల్, లడఖ్, శ్రీనగర్ లొకేషన్స్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో పాల్గొన్నాడు చైతన్య. ఈ షెడ్యూల్స్‌లో ఆమిర్, చైతన్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్రదర్శకుడు అద్వైత్ చందన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

