Adipurush | స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో ఒకటి ఆదిపురుష్ (Adipurush ). తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కాగా మరో 40 రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేసుకున్నారని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మేకర్స్ తిరుపతి, భద్రాచలం ప్రాంతాల్లో ఈవెంట్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు తిరుపతిలో మే 9న గ్రాండ్‌గా థ్రియాట్రికల్ ట్రైలర్‌ను లాంఛ్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. మరి తాజా వార్తలపై ఓం రౌత్ టీం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా.. బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి (లంకేశ్)గా నటిస్తున్నాడు.
ఆదిపురుష్‌లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. దేవ్‌దత్తా నగే హనుమంతుడి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సాచెట్-పరంపర ఆదిపురుష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు సలార్, ప్రాజెక్ట్ Kతోపాటు టాలీవుడ్ హార్రర్ కామెడీ సినిమాలతో బిజీగా ఉన్నాడు.