ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాప్‌గేర్’. శశికాంత్ దర్శకుడు. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, త్రీడీ మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆది కెరీర్లో ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆయనలోని మాస్ కోణాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించే చిత్రమిది. యూత్‌తో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలు ఇందులో వున్నాయి’ అన్నారు. రియా సుమన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: సాయిశ్రీరామ్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్.