Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
AadiSaikumar | డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయికుమార్, కెరీర్ మొదట్లో కొన్ని లవ్ స్టోరీలతో విజయాలను అందుకున్నారు.
Aadi Saikumar | డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయికుమార్, కెరీర్ మొదట్లో కొన్ని లవ్ స్టోరీలతో విజయాలను అందుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆయనకు సరైన హిట్లు పడలేదు. దీంతో రూట్ మార్చిన ఆయన, గత ఏడాది ‘శంబాల’ అనే మిస్టిక్ థ్రిల్లర్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సక్సెస్ ఆయన కెరీర్‌కు మంచి బూస్ట్ ఇవ్వడంతో పాటు, అభిమానుల్లో కొత్త జోష్ నింపింది.
ఈ విజయం ఇచ్చిన ఊపుతో ఆది సాయికుమార్ మరోసారి అలాంటి జానర్లోనే సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రశాంత్ జి రుద్రప్ప ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా. ‘నవరసన్’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అప్డేట్ను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక విడుదలైన కొత్త పోస్టర్లో దట్టమైన అడవి మధ్యలో ఉన్న పురాతన పూజా ప్రదేశం, వెలుగుతున్న నూనె దీపం, త్రిశూలాన్ని చుట్టుకుని పడగ విప్పిన పాము వంటి విజువల్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.
ఈ చిత్రంలో ఒక శక్తివంతమైన దైవ రహస్యం, ఊహించని ట్విస్టులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. మరో విశేషం ఏమిటంటే, ‘కాంతార’ ఫేమ్ అంజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రేక్షకులను సీట్లలో కదలకుండా కూర్చోబెట్టేలా అదిరిపోయే స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

