Sabdham | తెలుగు, తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ ఆది పినిశెట్టి (Aadhi Pinishetty). ఈ టాలెంటెడ్ యాక్టర్ హీరోగా నటించిన చిత్రం శబ్దం (Sabdham). వైశాలి ఫేం అరివజగన్ వెంకటాచలం (Arivazhagan Venkatachalam) దర్శకత్వం వహించిన ఈ మూవీ హార్రర్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
కాగా శబ్దం లాంగ్ గ్యాప్ తర్వాత ఓటీటీలో తన లక్ పరీక్షించుకునే రెడీ అయింది. ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తమిళంలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తెలుగు వెర్షన్‌కు సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ అం సుమారు ఏడాది తర్వాత డిజిటల్ ఇవ్వబోతున్న ఈ చిత్రం ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది చూడాలి.
ఈ చిత్రంలో అలనాటి అందాల తార లైలా కీలక పాత్రలో నటించగా… సిమ్రన్, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ స్లే ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను 7జీ ఫిలిమ్స్, అల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
Long Pending OTT Premiere Tamil Film #Sabdham Streaming Now On Zee 5🔥 pic.twitter.com/2bQfxLjJXO
— Saloon Kada Shanmugam (@saloon_kada) March 24, 2026
Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Vijayawada | విజయవాడలో టెర్రర్ కలకలం.. ముగ్గురు యువకులను ఉగ్రవాదంవైపు నెట్టిన హైదరాబాద్ యువతి!
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన దుండగుడు.. పలువురికి తీవ్ర గాయాలు