Aadhi Nikki Weeding | ఒక్కటైన ఆది-నిక్కీ..పెళ్లిలో నాని, సందీప్ కిషన్ డ్యాన్స్ వీడియో వైరల్
ఇవాళ చెన్నైలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ (Aadhi Nikki Weeding)ఈవెంట్లో తన ప్రియురాలు నిక్కీ గల్రాని (Nikki Galrani)తో కలిసి ఏడడుగులు వేశాడు ఆదిపినిశెట్టి (Aadi Pinishetty). హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబసభ్యులు, సన్నిహితుల, సినీ పరిశ్రమకు చెందిన స్నేహితుల సమక్షంలో వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ నటుడు ఆదిపినిశెట్టి (Aadi Pinishetty)ఓ ఇంటివాడయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఆది-నిక్కీ గల్రానికి నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే. ఇవాళ చెన్నైలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ (Aadhi Nikki Weeding)ఈవెంట్లో తన ప్రియురాలు నిక్కీ గల్రాని (Nikki Galrani)తో కలిసి ఏడడుగులు వేశాడు. హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబసభ్యులు, సన్నిహితుల, సినీ పరిశ్రమకు చెందిన స్నేహితుల సమక్షంలో వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది.
వెడ్డింగ్‌లో న్యాచురల్ స్టార్ నాని (Nani), సందీప్ కిషన్ (Sundeep Kishan)స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మెహిందీ సెర్మనీలో ఆలుమా డోలుమా పాటకు నాని, సందీప్ కిషన్‌తోపాటు ఆది-నిక్కీ డ్యాన్స్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఆ తర్వాత సాయంత్రం ఆర్య, సయేషా సెహగల్‌తో కలిసి ఆది-నిక్కీ పార్టీ చేసుకున్నారు. ఆఫ్ వైట్ కుర్తా సెట్లో ఆది పినిశెట్టి, పార్టీ నైట్ కోసం ప్రింటెడ్ కఫ్తాన్లో నిక్కీ తళుక్కున మెరిశారు. 2015లో వచ్చిన మలుపు సినిమాలో ఆది పినిశెట్టి-నిక్కీ కలిసి నటించారు.
అప్పటి నుంచి వీరిద్దరి మధ్య లవ్ జర్నీ మొదలైంది. ఆది-నిక్కీ వెడ్డింగ్ స్టిల్స్, వీడియోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. నిక్కీ గల్రానీ ప్రస్తుతం రెండు మలయాళ సినిమాల్లో నటిస్తోంది. ఆది పినిశెట్టి ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్లో విలన్‌గా నటిస్తున్నాడు. దీంతోపాటు మరో బైలింగ్యువల్ ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

