A.R. Rahman | రెహమాన్‌తో రిలేషన్.. క్లారిటీ ఇచ్చిన Mohini Dey!
A.R. Rahman | ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు, ఏ.ఆర్ రెహమాన్ సైరా బాను దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి విడాకులు ప్రకటించిన కాసేపటికే తన భర్త నుంచి విడిపోతున్నట్లు రెహమాన్ టీమ్‌లోని బాసిస్ట్ మోహిని డే వెల్లడించారు.
A.R. Rahman | ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు, ఏ.ఆర్ రెహమాన్ సైరా బాను దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి విడాకులు ప్రకటించిన కాసేపటికే తన భర్త నుంచి విడిపోతున్నట్లు రెహమాన్ టీమ్‌లోని బాసిస్ట్ మోహిని డే వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఆమె రెహమన్ ట్రూప్‌లో కొనసాగుతున్నారు. అయితే రెహమాన్, మోహిని డే ఒకేరోజు విడాకులు ప్రకటించడంతో ఈ ఇద్దరి మధ్య సంబంధం ఉందని అందుకే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్స్‌పై మోహిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది.
నేను విడాకులు ప్రకటించిన అనంతరం నుంచి మీ ఇంటర్వ్యూ కావాలని నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయితే వీళ్లంతా ఎందుకు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలుసు. ఈ చెత్తకు ప్రచారమివ్వాలన్న ఆసక్తి నాకు ఏమాత్రం లేదు. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి నా విలువైన సమయాన్ని వృథా చేసుకోలేను. దయచేసి నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి అంటూ మోహిని డే చెప్పుకోచ్చింది. మరోవైపు ఇదే విషయంపై రెహమాన్ భార్య సైరా తరఫు న్యాయవాది వందనా షా కూడా స్పందిస్తూ.. ఈ రూమార్స్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

