తమిళ కథానాయకుడు ధనుష్ నటిస్తున్న చిత్రం ‘నానే వరువెన్’. సెల్వ రాఘవన్ దర్శకుడు. తమిళంలో కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తుంది.
తాజాగా ఈ చిత్రం నుండి ‘వీరా సూర ధీర రారా’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చంద్రబోస్ రచించిన ఈ పాటను రాహుల నంబియార్ ఆలపించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 29న విడుదల చేస్తున్నారు.