Arjun Reddy | తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సంచలనం.. ‘అర్జున్ రెడ్డి’కి తొమ్మిదేళ్లు!
Arjun Reddy | టాలీవుడ్ తెరపై సరికొత్త దృశ్య కావ్యంగా, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన కల్ట్ బ్లాక్‌బస్టర్ 'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలై నేటితో తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది.
9 Years For Arjun Reddy | టాలీవుడ్ తెరపై సరికొత్త దృశ్య కావ్యంగా, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలై నేటితో తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. 2017 ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఇండియన్ సినిమా మేకింగ్ శైలినే పూర్తిగా మార్చివేసింది. ఎలాంటి భారీ అంచనాలు, పెద్ద స్టార్ క్యాస్ట్ లేకుండా అత్యంత సాధారణంగా అడుగుపెట్టిన ఈ సినిమా, అనూహ్యమైన రీతిలో యూత్ హృదయాలను కొల్లగొట్టి ట్రెండ్ క్రియేట్ చేసింది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కించిన ఈ చిత్రంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ టైటిల్ రోల్లో జీవించారు. అర్జున్ రెడ్డి పాత్రలోని ఇంటెన్సిటీ, ఎమోషనల్ డెప్త్, కోపం, ప్రేమ వంటి విభిన్న కోణాలను విజయ్ ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. హీరోయిన్గా పరిచయమైన షాలిని పాండే తన అద్భుతమైన నటనతో ప్రీతి పాత్రకు పూర్తిన్యాయం చేశారు. ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లో ఒక తిరుగులేని మైలురాయిగా నిలవడమే కాకుండా, ఆయనను రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ హీరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక సంగీత పరంగా రధన్ అందించిన మ్యూజిక్, హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లీగ్‌లోకి తీసుకెళ్లాయి. నేడు తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ఈ కల్ట్ క్లాసిక్‌ను మరోసారి ట్రెండ్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

