C PremKumar | ప్రముఖ మాలీవుడ్ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ మరియు విలక్షణ చిత్రాల దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ కాంబినేషన్లో ఒక సరికొత్త చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. తమిళంలో ’96’, ‘మెయ్యళగన్’ (తెలుగులో ‘సత్యం సుందరం’) వంటి హృదయానికి హత్తుకునే క్లాసిక్ చిత్రాలను అందించిన దర్శకుడు ప్రేమ్ కుమార్, ఈసారి ఫహాద్ ఫాజిల్‌తో కలిసి ఒక విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో ముందుకు వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర బృందం (మేకర్స్) సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ సోలో హీరోగా నటిస్తున్నారు.
ఇప్పటివరకు ఫీల్ గుడ్ మరియు ఎమోషనల్ కథలను తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్ కుమార్, మొదటిసారిగా ఒక థ్రిల్లర్ జోనర్‌ను ఎంచుకోవడం విశేషం. ఈ కథను తాను గత నాలుగేళ్లుగా సిద్ధం చేసుకున్నానని, జోనర్ మారినప్పటికీ తన గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ బలమైన భావోద్వేగాలు ఉంటాయని దర్శకుడు పేర్కొన్నారు. ఫహాద్ ఫాజిల్‌కు కేవలం 45 నిమిషాల పాటు కథ వినిపించగా, ఆయన ఎంతో ఎగ్జైట్ అయ్యి వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) సరసన శివద (Sshivada) కథానాయికగా నటిస్తుండగా.. చేతన్, హరీష్ ఉత్తమన్, కరుణాకరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. వేల్స్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై ఈషారి కే గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
#ProductionNo32 Presented by Dr. Ishari K Ganesh
Produced by @VelsFilmIntl In Association with @monsoonmoviesStarring: #Fafa & #Shivada
Written & Directed by #CPREMKUMAR@IshariKGanesh @kushmithaganesh @velsmusicintl #GOVIND_VASANTHA @Chetan_k_a #HarishUthaman… pic.twitter.com/M7iDLZoRdu— Vels Film International (@VelsFilmIntl) May 16, 2026