8 Vasantalu | ‘8 వసంతాలు’ అంటూ వస్తున్న ఫణీంద్ర నర్సెట్టి.. రేపే ఫస్ట్ లుక్
8 Vasantalu | టాలీవుడ్ యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూట్యూబ్‌లో మధురం అనే షార్ట్ ఫిల్మ్ తీసి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఫణీంద్ర. ఈ లఘు చిత్రం యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోవడమే కాకుండా పలు అవార్డులు అందుకుంది.
8 Vasantalu | టాలీవుడ్ యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూట్యూబ్‌లో మధురం(Madhuram) అనే షార్ట్ ఫిల్మ్ తీసి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఫణీంద్ర. ఈ లఘు చిత్రం యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోవడమే కాకుండా పలు అవార్డులు అందుకుంది. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ నటి చాందిని చౌదరి(Chandini Chowdary) ఫేమస్ అయ్యింది. అయితే ఈ సినిమా అనంతరం ఫణీంద్రా బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్(Raaja Gautham)తో మను(Manu) అనే చిత్రం తెరకెక్కించారు. క్రౌడ్ ఫండింగ్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం దాదాపు 6 సంవత్సరాల తర్వాత మరో కొత్త సినిమాతో ముందుకు రాబోతున్నాడు ఫణీ. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasantalu).
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రేపు ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ పోస్టర్లో మీరు తనని రేపు చూస్తారు అంటూ రాసుకోచ్చారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం… అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం. 8 వసంతాలు అంటే ‘8 స్ప్రింగ్స్’ ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది.
Tomorrow at 11:07 AM ❤️
Stay tuned to @MythriOfficial#8Vasantalu pic.twitter.com/BdMFnPUIsq
— Mythri Movie Makers (@MythriOfficial) June 6, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

