8 వసంతాలు.. ఓ స్త్రీమూర్తి జీవితం
ఆమె ఓ తెలివైన కూతురు.. మంచి స్నేహితురాలు.. షరతులు పెట్టని ప్రేమికురాలు.. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం గల విద్యార్థి.. సమాజాన్ని ప్రభావితం చేయగల అద్భుతమైన రచయిత్రి.. మొత్తంగా మానవత్వం మూర్తీభవించిన స్త్రీ.. ఆమె పేరు ‘శుద్ధి అయోధ్య’.
ఆమె ఓ తెలివైన కూతురు.. మంచి స్నేహితురాలు.. షరతులు పెట్టని ప్రేమికురాలు.. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం గల విద్యార్థి.. సమాజాన్ని ప్రభావితం చేయగల అద్భుతమైన రచయిత్రి.. మొత్తంగా మానవత్వం మూర్తీభవించిన స్త్రీ.. ఆమె పేరు ‘శుద్ధి అయోధ్య’. ఆమె 19ఏళ్ల వయసు నుంచి 27ఏళ్ల వయసు వరకూ ఎనిమిదేళ్ల ఆమె ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతోన్న భావోద్వేగాల సమాహారం ‘8 వసంతాలు’. ‘మ్యాడ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అవంతిక సనీల్‌కుమార్ ప్రధానపాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. శుద్ధి అయోధ్యగా అనంతిక గెటప్‌ని మేకర్స్ రివీల్ చేశారు. కళ్లకు కాటుక, చెవులకు పోగులు, ముక్కుకు రింగుతో.. అందంగా నవ్వుతూ చెమ్మగిల్లిన కళ్లతో అనంతిక ఈ లుక్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. సినిమాపై కూడా ఆసక్తిని రెకేత్తించేలా ఈ స్టిల్ ఉందని పలువురి అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథరెడ్డి, సంగీతం: నరేశ్ కుమారన్, నిర్మాతలు: నవీన్ యర్నేని, వై.రవిశంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

