71st National Film Awards | నేడే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
71st National Film Awards | 71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల (71st National Film Awards) ప్రదానోత్సవం ఈరోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గ్రాండ్‌గా జరుగబోతుంది.
71st National Film Awards | 71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల (71st National Film Awards) ప్రదానోత్సవం మరికొన్ని గంటల్లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గ్రాండ్‌గా జరుగబోతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై జాతీయ అవార్డుల ప్రకటించిన విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్‌తో పాటు బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ హాజరుకాగా.. నటుడు విక్రాంత్ మస్సే అలాగే ఇతర భాషల నుంచి పలువురు సినీ ప్రముఖులు, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఈ ఏడాది ‘జవాన్’ సినిమాకు గానూ షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాకు రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాలను అందుకోబోతున్నారు. షారుఖ్ తన 33 ఏళ్ల కెరీర్లో తొలిసారి ఈ అవార్డును గెలుచుకోబోతుండగా.. ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్, ’12th ఫెయిల్’ సినిమాకు గానూ విక్రాంత్ మాస్సేతో కలిసి ఈ అవార్డును పంచుకుంటున్నారు. అలాగే ఈ వేడుకలో ’12th ఫెయిల్’ చిత్రానికి ఉత్తమ చలనచిత్ర పురస్కారం, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం పురస్కారం దక్కనున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోనున్నారు. తెలుగు నుంచి బలగం సినిమాకు అవార్డు గెలుచుకున్న సింగర్ కాసర్ల శ్యామ్‌తో పాటు భగవంత్ కేసరి టీమ్, బేబీ టీమ్ సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

